ఇరాక్ లో కారు బాంబు పేలుడు... 115 మంది మృతి
ఇరాక్ లో ఉగ్రవాదులు దారుణ ఘటనకు పాల్పడ్డారు. అక్కడి దియాలా ప్రావిన్స్ లోని ఖాన్ బేని సాద్ పట్టణంలో ఉన్న మార్కెట్ ప్రాంతంలో గత రాత్రి కారుబాంబుతో ఆత్మాహుతి దాడి చేశారు. రంజాన్ నెల చివరిరోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 115 మంది చనిపోయారు. 170 మంది తీవ్రంగా గాయపడగా, వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.